![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'Brahamamudi ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -981 లో.....ఇందుని తన ట్రాప్ లో పడేసుకోవడానికీ రాకీ తనకి జ్యూస్ లో ఏదో కలుపుకొని వస్తాడు. ఇందు జ్యూస్ తాగబోతుంటే అప్పుడే రాజు, లక్కీ మాట్లాడుకుంటూ వస్తారు. దాంతో ఇందు జ్యూస్ కింద పడిపోతుంది. ఇందుని రాజు చూసి .. ఓసి నువ్వా అని అంటాడు. నీకు ఇలాంటి పనులు మాత్రమే వచ్చా అని ఇందు కోప్పడుతుంది. రాకీని రాజు తిడతాడు. నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావ్ కదా.. నీకు ఉద్యోగం ఇవ్వనని చెప్పి రాకీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
వాడు పబ్ లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాడు అంటేనే అర్ధం చేసుకోవాలి.. వాడు ఎలాంటి వాడో అని రాజు అనగానే ఇందు తనపై కోప్పడి వెళ్తుంది. ఆ తర్వాత ఇందు వెళ్తుంటే రేఖ తన ఫ్రెండ్స్ ఫుల్ తాగి వెళ్లడం ఇందు చూసి ఎక్కడికి వెళ్ళినా ఇదేంటి నాతోనే వస్తుందని ఇందు అనుకుంటుంది. రేఖ కార్ దగ్గరికి వెళ్లి కార్ ఎక్కకుండా బయట ఉండి.. అదేంటి కార్ కి స్టీరింగ్ లేదని అనుకుంటుంది. అప్పుడే రాజు, లక్కీ వస్తారు. లక్కీ నువ్వు వెళ్లి తనని డ్రాప్ చేయమని రాజు చెప్పగానే లక్కీ, ఐశ్వర్యని తీసుకొని వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళాక పోలీసులు ఉంటారు. ఐశ్వర్య ఫుల్ గా తాగి ఉంటుంది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తామని ఊదమంటారు. దాంతో లక్కీ భయపడతాడు. దాంతో పోలీసులు స్టేషన్ కి తీసుకొని వెళ్తారు. అదంతా ఇందు చూస్తుంది.
మరొకవైపు పబ్ కి ఇన్ఫార్మర్ గా వచ్చిన నందు రౌడీల కోసం చూస్తుంది. అందరికి డౌట్ రాకుండా వెంకీతో డ్యాన్స్ చేస్తుంది వెంకీకి మాత్రం ఏం అర్థం కాదు. రౌడీలు కనపడగానే నందు వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తుంది. నువ్వు ఇప్పుడే ఇదంతా చేస్తున్నావ్.. రేపు జాబ్ వచ్చాక మాములుగా ఉండదని కానిస్టేబుల్ అంటాడు. ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్ కి లక్కీ, ఐశ్వర్య వస్తారు. నువ్వు ఎన్ని రోజుల నుండి ఇలా అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నావు.. మీ గ్యాంగ్ లో ఎంతమంది ఉన్నారు.. నువ్వే మెయిన్ ఆ అని లక్కీని ఇన్‌స్పెక్టర్ అడుగుతాడు. నాకేం తెలియదని లక్కీ అంటాడు. నీ పేరేంటి అని ఐశ్చర్యని ఇన్‌స్పెక్టర్ అడుగగా తను మత్తులో ఉండి గుర్తుచేసుకుంటూ ఉండగా ఐశ్వర్య అని లక్కీ చెప్తాడు. దాంతో అతని చెంపచెల్లునిపిస్తాడు పోలీస్. మీ పేరెంట్స్ ఎవరమ్మ అమి పోలీస్ అడుగుతాడు. తరువాయి భాగంలో తాగి ఉన్న ఐశ్వర్యని తీసుకొని ఇందు, స్వాతి వస్తారు. అప్పుడే రేఖ వచ్చి ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |